Bigg Boss 8 : మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది వీళ్లేనా!
on Oct 2, 2024
బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా మోస్ట్ ట్రెండింగ్ టాపిక్. లిమిట్ లెస్ థీమ్ తో మొదలైంది బిగ్ బాస్-8. ఎవరు ఊహించని ట్విస్ట్ లతో ఉత్కంఠగా సాగుతుంది. పద్నాలుగు మందితో మొదలైన ఈ సీజన్.. ఇప్పుడు పదిమంది మాత్రమే హౌస్ లో ఉన్నారు. (Bigg Boss 8 Telugu)
ఇప్పుడు ఎవరు ఉహించని విధంగా గత వారం జరిగిన సండే రోజు ఎపిసోడ్ లో.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. దీంతో ఎవరు వెళ్తారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. అయితే ఈ వారం నామినేషన్ లో ఆరుగురు ఉన్నారు. నబీల్, విష్ణుప్రియ, నిఖిల్, నైనిక, ఆదిత్య ఓం, నాగ మణికంఠ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో ఆడియన్స్ ఓట్లని లెక్కలోకి తీసుకొని లీస్ట్ ఉన్నవారిని బయటకు పంపిస్తారో లేక హౌసెమేట్స్ ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేస్తారో చూడాలి. ఓటింగ్ ప్రకారం అయితే లీస్ట్ లో నైనిక, ఆదిత్య ఓం ఉన్నారు. ఒకవేళ హౌసమేట్స్ ఒపీనియన్ లేకుండా బిగ్ బాస్ మీరే ఒకరిని బయటకు పంపించండి అనే అవకాశం ఇస్తే అందరు ఆదిత్య ఓం ని బయటకు పంపించే అవకాశం ఉంది. కానీ నిన్నటి ఎపిసోడ్ లో అదిత్య ఓం టాస్క్ లో గెలిచి అతను గేమ్స్ లో యాక్టివ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. (Mid Week Elimination)
ఇక ఓటింగ్ లో నబీల్, నిఖిల్ టాప్ లో ఉన్నారు. వీరితో పాటు విష్ణుప్రియకి అత్యధిక ఓటింగ్ పడుతుంది. అయితే నైనికకి ఎక్కువగా ఫ్యాన్ బేస్ లేకపోవడంతో తనకి ఓటింగ్ చాలా తక్కువగా ఉంది. ఆదిత్య ఓం ఓ ఊరిని దత్తత తీసుకోవడం.. వారి కోసం సపరేట్ అంబులెన్స్ ని ఏర్పాటు చేయడం.. ఇలా ఎవరికి తెలియకుండా కొన్ని మంచి పనులు చేస్తున్న ఆదిత్య ఓం కి గ్రామాల నుండి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. రేపటి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలియాల్సి ఉంది.
Also Read